రఘురామపై నా వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకుంటున్న
నాపై ఆయనకున్న ప్రేమను అపార్థం చేసుకున్న
ఇక నుండి ఆయనతోనే నడుస్తా
టిడిపి అభ్యున్నతికి నా జీవితం అంకితం
ఉండి
ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పై తాను ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు టిడిపి సీనియర్ నాయకుడు, వెలివర్రు మాజీ సర్పంచ్ పోత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్య రాజు) అన్నారు. గురువారం సాయంత్రం వెలివర్రు గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రేమను తాను అర్థం చేసుకోలేకపోయాను అని అపార్థం చేసుకున్నానని కొంతమంది వ్యక్తులు నన్ను మానసిక శోభకు గురి చేయడం వల్ల నా ఆరోగ్యం సహకరించ పోవడం వల్ల అటువంటి వ్యాఖ్యలు చేశాను తప్ప ఆయనపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదని నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అభివృద్ధిని ఇంతవరకు ఈ ఎమ్మెల్యే చేయలేదని ఆయన అన్నారు గత 5 సంవత్సరాలపాటు వైసీపీలో ఉన్న నాయకులు నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని అదే నాయకుడు ఈరోజు వెలివర్రు లో ఎత్తనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయానని ఆ వ్యక్తి నన్ను మానసిక శోభకు గురిచేస్తున్నాడని దానిని తట్టుకోలేక తండ్రి సమానులు అయిన డిప్యూటీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానని ఆయన పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారు అని 100% నమ్ముతున్నానని ఆయన అన్నారు టిడిపిలో ఉంటూ ఆయనతోనే నా ప్రయాణం సాగిస్తానని ఇక ముందు ఎన్నడు ఇటువంటి పొరపాటు జరగదని ఆయన తెలిపారు నా వ్యాఖ్యలకు ఆయన బాధించిన ఆయన మాత్రం నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారని నా బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారని అటువంటి వ్యక్తిని నేను ఎలా నిందించానో నాకే కూడా అర్థం కావడం లేదని ఆయన వాపోయారు రఘురామకృష్ణమరాజు కుటుంబానికి మచ్చ తెచ్చే విధంగా ఎటువంటి పని చేయనని ఆ కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన గౌరవానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వారన్నారు నేను ఎన్ని మాటలు అన్న తిరిగి ఒక్క మాట కూడా అనని ఆయన నాకు దేవుడితో సమానమని అన్నారు అటువంటి గొప్ప వ్యక్తిని తూలనాడినందుకు సిగ్గుపడుతున్నానని ఈ విషయంలో పాలకోడేరు రూరల్ బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు పై చేసిన వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇకముందు పార్టీ ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ఆయన తెలిపారు. నన్ను ఇబ్బందులకు గురిచేసిన కల్లేపల్లి సతీష్ రాజును అమ్మవారి ఆలయానికి చైర్మన్గా చేయడం జీర్ణించుకోలేకపోయానని సతీష్ రాజు అతను వైసీపీలో ఉన్నప్పుడు నాపై ఎన్నో అక్రమ కేసులు పెట్టించాడని దాంతో మానసిక శోభకు గురయ్యానని ఇకపై నా ప్రవర్తనను పూర్తిగా సరి చేసుకున్నానని ఇకపై ఎటువంటి తప్పిదాలు జరక్కుండా చూసుకుంటానని వైసిపి వలసదారులతో పార్టీకి నష్టమని ఆయన తెలియజేశారు.
రఘురామపై నా వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకుంటున్న నాపై ఆయనకున్న ప్రేమను అపార్థం చేసుకున్న ఇక నుండి ఆయనతోనే నడుస్తా టిడిపి అభ్యున్నతికి నా జీవితం అంకితం పోత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్య రాజు
Bureau
April 23, 2026 04:03 PM
23 views
Related News
No related news found.
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
27 Apr 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఎర్ర చందన నిందితునికి 5 సంవత్సరాలు జైలు -3 లక్షల జరీమనా కోర్టు సంచలనాత్మక తీర్పు
Apr 24, 2026
రఘురామపై నా వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకుంటున్న నాపై ఆయనకున్న ప్రేమను అపార్థం చేసుకున్న ఇక నుండి ఆయనతోనే నడుస్తా టిడిపి అభ్యున్నతికి నా జీవితం అంకితం పోత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్య రాజు
Apr 23, 2026
కొత్తపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే బండారు పలు విజ్ఞాపనలు సీఎం తక్షణ ఆమోదం 5 కోట్ల చొప్పున బీసీ మరియు ఎస్సీ కమ్యూనిటీ భవనాల అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఆలమూరులో 'ట్రామా కేర్ సెంటర్'
Apr 23, 2026